సాధకులకు సాధనా గుళికలు గుణములనగా ఏమి? * ఇతరులకు అపకారం చేయక పోవడం. ఉపకార బుద్ది కలిగి ఉండటం, సత్యం చెప్పడం, భగవంతుని విశ్వసించడం ఇవే మంచి గుణములు. ప్రకృతి గుణాలంటే సత్వ రజస్తమోగుణాలు. * బాధ్యత నిర్వర్తించాలి * "నేను అందరిని ఆదుకుంటాను." అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునునికి చెప్పిన మాట భక్తులకు ఎంతో తృప్తినిస్తుంది. తనకోసం అంటూ ఒకరున్నారనే భావం కలిగితే వారికోసం ఏ పని చేయటానికైనా వెనుకాడడు మానవుడు.భగవంతుడు ఆదుకుంటాననే మాట ఇచ్చాడు కాబట్టి ఆయన చెప్పిన నీతి మార్గంలో మనమంతా నడిచేందుకు సంశయించాల్సిన పనిలేదు. భగవంతుడు అర్జునునికి చెప్పిన మరో విశేశం నీ కర్మలను నీవు విధిగా ఆచరించి ఫలితాన్ని నాకు వదిలేయమని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యత నిర్వహణలో ఏమాత్రం విసుగు కోపం చెందక నిర్వహించాలి. భార్య, భర్తలకు కూడా వేరు వేరు బాధ్యతలను సమాజం నిర్దేశించింది. ఇందులో ఒకరి బాధ్యత గొప్పదని కానీ, రెండవవారిది హీనమైనది అని కానీ లేదు. తమ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించటం ద్వారా కుటుంబ సభ్యులకు తృప్తి కలిగించాలి. ఆ బాధ్యత నిర్వహణలో కోపం, విసుగు, ప్రదర్శనవలన వారికి దక్కాల్స...